![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -160 లో.... స్వప్న బోల్డ్ ఫోట్ షూట్ వీడియోని దుగ్గిరాల ఫ్యామిలీ చూసి స్వప్నని తిడతారు. ఇలాంటి పని చేసినదాన్ని ఇంట్లో నుండి గెంటేయ్యండని రుద్రాణి అంటుంది. అప్పుడే కనకం, కృష్ణమూర్తి వచ్చి.. స్వప్నపై కోప్పడతారు. స్వప్న చేసిన పనికి తల్లిగా నాది తప్పు.. దయచేసి, క్షమించండని సీతారామయ్య ఇందిరాదేవికి చేతులు జోడించి అడుగుతుంది.
ఆ తర్వాత ఒకరు చేసిన తప్పుకు ఇంకొకరిని బాధ్యులు చెయ్యడం కరెక్ట్ కాదని సీతరామయ్య కనకంతో అంటాడు. అలా మాట్లాడడం మీ సంస్కారమని, ఇక మేం వెళ్తామని కనకం అనగానే.. మీరు ఏ పని గురించి వచ్చారో చెప్పకుండానే వెళ్తున్నారా అని సీతారామయ్య అంటాడు. అంటే కడుపుతో ఉన్నా స్వప్నకి సూడిగం తీసుకొచ్చాం కానీ ఇక్కడికి వచ్చాక అవసరం లేదని అనిపిస్తుంది. కనకం అలా అనగానే సంప్రదాయం ప్రకారం తీసుకొని వచ్చారు. చేసే వెళ్ళండని ఇందిరాదేవి అనగానే కనకం ఫలహారలు స్వప్న ఒళ్ళో పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొక వైపు ప్లాన్ అంతా ఫెయిల్ అయిందనే కోపంతో ఆ స్వప్నని ఇంటి నుండి గెంటేస్తారని అనుకుంటే ఇలా జరిగింది ఏంటని రాహుల్ రుద్రాణి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక మనకు ఇలాంటి ఛాన్స్ స్వప్న ఇస్తుందో లేదో అని రాహుల్ అంటాడు. అక్కడ ఉంది కావ్య కాదు, స్వప్న కాబట్టి కచ్చితంగా మనకి మరొక ఛాన్స్ ఇస్తుందని రుద్రాణి అంటుంది. మరొకవైపు దుగ్గిరాల ఇంట్లో జరిగిందంతా అన్నపూర్ణ, అప్పులకి కనకం చెప్తుంది. అప్పు ఇక నుండి నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోకు, పెళ్లి అయ్యాక కూడా ఇలాగే ఉంటే తల్లిని కాబట్టి నన్నే అంటారని కనకం అనగానే.. నేను మారను, నాలాగే ఉంటానని అప్పు అంటుంది. నీ కోపం అప్పుపై ఎందుకు చూపిస్తున్నావు. అది అలా ఉంటే ఇష్టపడే అతన్నే తీసుకొని వచ్చి పెళ్లి చేస్తానని కృష్ణమూర్తి అంటాడు.
మరొకవైపు సీతరామయ్య, ఇందిరాదేవీలు మాట్లాడుకుంటారు. అసలు ఈ స్వప్న ఎందుకు ఇలా చేస్తుందని ఇందిరాదేవి అంటుంది. తనకి స్వేచ్ఛ ఇవ్వడం లేదని స్వప్న ఫీల్ అవుతుంది కానీ తనకు ఇష్టమైన మోడలింగ్ చేసుకో కానీ బిడ్డ పుట్టాక అని చెప్పం కదా, అయినా స్వప్నకి నచ్చడం లేదని సీతరామయ్య అంటాడు. వాళ్ళ మాటలు విన్న కావ్య, రాజ్ లు.. మీ అక్క చేసిన తప్పు వల్ల ఇంట్లో వాళ్ళు ఎలా బాధపడుతున్నారో చూడు.. మళ్ళీ మీ అక్క ఏం తప్పు చెయ్యనట్లు ప్రవర్తిస్తే నాకు చాలా కోపంగా ఉందని కావ్యతో రాజ్ అనేసి వెళ్ళిపోతాడు. స్వప్న దగ్గరకి కావ్య వెళ్లి.. ఇంట్లో వాళ్ళందరిని బాధపెడుతున్నావని స్వప్నని తిడుతుంది. స్వప్న మాత్రం కావ్య మాటలు పట్టించుకోదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |